రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి ఆధ్వర్యంలో నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు.
రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం బొబ్బిలి పట్టణంలో గల స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైసిపి నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.