సీతానగరం పిహెచ్సి పెద్ద భోగిలో శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. గర్భిణి స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. క్యాంప్ వద్దకు వచ్చిన గర్భిణీ స్త్రీలకు టెస్టులు చేసి ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు.
హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి పిజీకి తరలించి డాక్టర్ పరివేక్షణలో ఐరన్ సుక్రోజ్ ఇచ్చారు. 67 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన వారికి రక్త నమోనాలు సేకరించి నెలకి సరిపడా మందులు పంపిణీ చేశారు.