మెంటాడ మండలం జయితి గ్రామంలో తాహాసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సమస్యలపై అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన.
అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు పెట్టినట్లు తెలిపారు. అనంతరం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 10 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దుర్గా, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.