ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా ఉపాధ్యాయ, పేరెంట్స్ సమావేశం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు.
ఎల్ కోట మండలం రంగాపురం లోని కేజీబీవీ పాఠశాల,మోడల్ స్కూల్లో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు ఆమెకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యారంగంలో నూతన శకానికి ప్రభుత్వం నాంది పలుకుతోందని ఆమె కొనియాడారు.