కొమరాడ మండల కేంద్రానికి సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పార్వతీపురం నుంచి రాయగడ వైపు వెళ్తున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. స్వల్ప గాయాలతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. కానీ అంతర్ రాష్ట్ర రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొమరాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.