విశాఖ విమానాశ్రయం వద్ద శనివారం తగినంత వెలుతురు లేకపోవడం, మంచు ఆవరించి ఉండటంతో పలు విమానాలను దారి మళ్లించారు. దిల్లీ-విశాఖ విమానాన్ని భువనేశ్వర్ వైపు. హైదరాబాద్-విశాఖ, బెంగళూరు-విశాఖ విమానాలు హైదరాబాద్ వైపు మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సమాచారం అందించినట్లు చెప్పారు.