ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడవాసులకు తీపికబురు.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, అమరావతికి ఈజీగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 07:17 PM

విజయవాడవాసుల కల నెరవేరబోతోంది.. ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. నగరవాసులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ ముగింపు దశకు వచ్చింది.. ఎన్నో ఏళ్లు నరకయాతన నుంచి త్వరలోనే విముక్తి దక్కనుంది. వెస్ట్ బైపాస్ మరో మూడు నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యల్ని ముమ్మరం చేసింది. ఈ బైపాస్ పూర్తైతే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వాసులు విజయవాడలోకి అడుగు పెట్టకుండానే హైదరాబాద్ వైపు వెళ్లొచ్చు.


అంతేకాదు బైపాస్ మీదుగా విజయవాడలోకి చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిలోకి అడుగుపెట్టాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సి అవసరం ఉండదు. బైపాస్ ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి కేవలం అరగంటలోనే అమరావతికి వెళ్లొచ్చు. గుంటూరుతో పాటుగా ఆపై ప్రాంతాలకు వెళ్లేవారూ విజయవాడ ట్రాఫిక్ బారిన పడకుండా వేగంగా వెళ్లొచ్చు.


విజయవాడ బైపాస్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.. అయితే నేషనల్ హైవేకు అడ్డుగా ఉన్న హైటెన్షన్‌ లైన్లను మార్చాల్సి ఉంది. దీంతో రైతులు భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అలైన్‌మెంట్‌ మార్చాలని కోరారు. తక్కువ భూమి మీదుగా వెళ్లేలా పెద్ద టవర్లు వేయాలని అడిగారు. అయితే ఈ అలైన్‌మెంటు మార్పు సాధ్యం కాదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తేల్చి చెప్పారు.


గతవారం కూడా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అధికారులు అనుమతి లేకుండా తమ పొలాల్లో హైటెన్షన్ విద్యుత్ టవర్లను నిర్మిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. బైపాస్ నిర్మాణానికి తాము సంపూర్ణ సహకారం అందిస్తున్నామని.. కొందరు అధికారుల తీరుతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయా


మరోవైపు జాతీయ రహదారి-16 (చెన్నై-కోల్‌కత్తా) విస్తరణలో భాగంగా విజయవాడకు బైపాస్‌ నిర్మిస్తున్నారు. ఈ తూర్పు బైపాస్‌ రెండు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మీదుగా వెళుతుంది.. ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, పెనమలూరు మండలాలు.. దుగ్గిరాల మంగళగిరి మండలాల మీదుగా చినకాకాని చేరుతుంది. కృష్ణా జిల్లాలో 59.036 శాతం దూరం ఉంటే గుంటూరు జిల్లాలో 40.964 శాతం దూరం ఉంది. కృష్ణా జిల్లాలో పెదఅవుటపల్లి, చిన్నఅవుటపల్లి, పొట్టిపాడు, ఆత్కూరు, అల్లాపురం, బుద్ధవరం, అజ్జంపూడి, కేసరపల్లి, మంతెన-1, ఉప్పులూరు, జగన్నాథపురం, మద్దూరు, గోసాల, మంతెన-2, పునాదిపాడు, గొడవర్రు వణుకూరు మీదుగా కృష్ణా నది దాటుతుంది.గుంటూరు జిల్లాలో పెదకొండూరు, చినపాలెం, శృంగారపురం, తుమ్మపూడి, చిలువూరు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి, చినకాకాని గ్రామాల్లో భూసేకరణ చేయాలి. మొత్తానికి అమరావతికి కనెక్టవిటీని పెంచుతూ విజయవాడకు బైపాస్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com