క్రికెట్ చరిత్రలో అభిమానులను ఆశ్చర్యపరిచిన రికార్డులు చాలా ఉన్నాయి. కొన్ని రికార్డులు అందరి హృదయాలను గెలుచుకున్నప్పటికీ కొన్ని రికార్డుల గరించి వింటే సాధ్యం అవుతుందా నమ్మకం లేకుండా ఆశ్చర్యం వ్యక్తంచేస్తారు. అలాంటి అరుదైన మరో రికార్డు టెస్టు క్రికెట్ లో నమోదైంది. వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ ప్రత్యేకత చోటుచేసుకుంది. ఇది చరిత్ర పుటల్లో నమోదైంది. ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేని ఘనతను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సాధించింది. 1082 మ్యాచ్‌లు, 147 ఏళ్లు, 717 మంది క్రికెటర్లు.. ఇది క్రికెట్ హిస్టరీలో నిలిచేపోయేలా చేసింది ఇంగ్లాండ్ జట్టును. న్యూజిలాండ్‌తో వెల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో శనివారం జరిగిన రెండో టెస్టులో 500,000 టెస్ట్ పరుగులను దాటిన మొదటి జట్టుగా అవతరించింది ఇంగ్లండ్. 'క్రికెట్ పితామహుడు'గా పేరొందిన ఈ దేశం టెస్టు రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేయగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో 378/5 పరుగులతో ఇంగ్లాండ్ ఆటను కొనసాగిస్తోంది.
ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌ల్లో 5 లక్షల పరుగులు పూర్తి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 51వ ఓవర్‌లో హాఫ్ మిలియన్ (5 లక్షలు) పరుగులు పూర్తి చేసింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ విలియం ఓ'రూర్క్ వేసిన బంతిని మిడ్-ఆఫ్ వద్ద టాస్ చేసి హ్యారీ బ్రూక్ రెండు పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించేందుకు ఇంగ్లండ్ 18,900కు పైగా వ్యక్తిగత ఇన్నింగ్స్‌లు ఆడింది. రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మొత్తం స్కోరు 500126 పరుగులకు చేరింది. ఇంగ్లాండ్ యాషెస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా 1877 క్రికెట్ ఆడుతూ.. 428,000 కంటే ఎక్కువ పరుగులు చేసి టెస్ట్‌లలో రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత 586 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్ 278751 పరుగులు చేసి మూడో స్థానంలో ఉంది. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ అత్యధికంగా 929 సెంచరీలు చేసింది.