రాజంపేట మండలం గొల్లపల్లి లో వివాహిత నిర్మలా దేవి (55) ఆదివారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందింది. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫిర్యాదు చేయకుండా మీరు ఎలా సంఘటన స్థలానికి వచ్చారు అంటూ మృతురాలి భర్త నాగేశ్వర నాయక్, బంధువులు పోలీసులతో వాదించారు. మృతదేహం తరలింపుకు ప్రయత్నాలు చేయగా ఎస్ఐ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అడ్డుకోగా వాద్వివాదానికి దిగారు.