ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ రావు అన్నారు. ఆదివారం రేపల్లె రూరల్ మండలం బొందలగరువు గ్రామంలో శ్రీ సీతారామ మందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మోపిదేవి వెంకట రమణరావు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మోపిదేవికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.