మెంటాడ మండలంలోని గిరిజన గ్రామమైన లోతుగెడ్డలో ఆదివారం ఆండ్ర ఎస్సై కే సీతారాములు నిరుపేద గిరిజనులకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు.
గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు కార్యాచరణ పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.