డుంబ్రిగుడ మండలంలోని బూసిపుట్ ఒడిశా సోనాబెడ గ్రామాలకు మధ్య రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారిపై గోతులు ఏర్పడి కొండవాగు ప్రాంతం.
నుంచి వచ్చే ఊటనీరు రహదారిపై నిల్వ ఉండి నీటి కుంటలను తలపిస్తుండడంతో వాహనచోదకులు ఎటు వెళ్ళలో తెలియక పలు సమయాల్లో ప్రమాదాలకు గురవుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ అంతర్రాష్ట్ర రహదారికి మరమ్మతులు చేపట్టాలని మంగళవారం కోరారు.