అరకులోయ మండలంలోని కందమాలి పరిసర గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ సెల్ సిగ్నల్స్ వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ నిర్మాణం.
చేపట్టి ఏడాదయిన నేటికి వరకు సెల్ సిగ్నల్స్ వినియోగంలోకి తీసుకురాకపోవడంతో కందమాలి చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు ఆయా విధులకు వెళ్లే ఉద్యోగులు ఫేస్ హాజరు నమోదుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంగళవారం వాపోయారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరారు.