చెన్నై-బెంగళూరు హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీ కొట్టడంతో బస్సు నుజ్జు నుజ్జు అయింది. బస్సు యూటర్న్ తీసుకొంటుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో నమోదు కాగా వైరల్ గా మారాయి.