చిట్వేలు లోని భవిత సెంటర్ నందు మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ కోదండ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు దివ్యాంగుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ 2 ఈశ్వరయ్య, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శిరీష వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.