అనంతపురం నగర శివారుల్లోని టీవీ టవర్ సమీపంలో ఓ మందుబాబు నాగుపాముతో ఆటలాడుతూ హల్‌చల్ చేశాడు. కదిరి-అనంతపురం హైవే పక్కన కూర్చొని పామును చేతిలో పట్టుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పాము పడగ విప్పగా చేత్తో అటూ ఇటూ ఆడిస్తూ పట్టుకున్నాడు. మెడలో వేసుకుని అటూ ఇటూ తిరిగాడు. దగ్గరకు వస్తే పాము విసిరేస్తానంటూ స్థానికులను భయపెట్టాడు. అయినా ఆ పాము ఇతడిని కాటు వేయకపోవడం గమనార్హం. ఇంతలో కొంత మంది మందుబాబును మందలించి పామును సమీపంలోని చెట్లపొదల్లోకి విడిచి పెట్టేలా చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa