పులివెందుల మెగా లేఅవుట్ ను కాంగ్రెస్ నాయకులు బుధవారం పరిశీలించారు. జగన్ పాలనలో పేదల ఇళ్ల నిర్మాణం నత్త నడకన సాగితే చంద్రబాబు పాలనలో పడకేసింది అని ఆరోపణలు చేశారు. లే అవుట్ లో 6వేల ఇళ్లకు గాను కేవలం 27 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయన్నారు. పూర్తైన ఇళ్లలో లబ్దిదారులు ఒక్కరూ కూడా చేరలేదన్నారు. త్వరగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.