ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 10:03 PM

జగద్విఖ్యాత మహా నటుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నందమూరి తారకరామారావు తొలి చిత్రం మనదేశం విడుదలై 75 ఏళ్లయిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మనదేశం చిత్ర నిర్మాత కృష్ణవేణి గారు కూడా హాజరవడం విశేషమని అన్నారు. ఆమెకు ఇప్పుడు 102 సంవత్సరాలని, ఆమె పట్టుదలను మెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో పట్టుదలతో రావడమే కాకుండా, ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారని వివరించారు. అందుకు కారణం ఆమె జీవితంలో క్రమశిక్షణ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రావడం హర్షణీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దగ్గుబాటి సురేశ్, మాజీ ఎంపీ జయప్రద, ప్రభ, కృష్ణంరాజు అర్ధాంగి శ్యామల, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కేఎస్ రామారావు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నందుకు టీడీ జనార్ధన్ ను అభినందిస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ లేకపోతే ఈ కార్యక్రమం లేదని అన్నారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa