దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా ఎలాంటి గుర్తింపుకైనా ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఆధార్ కార్డుల్లో సవరణలు, అప్ డేట్ చేసుకోవడం కోసం కేంద్రం ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంచింది. వచ్చే ఏడాది జూన్ 25 వరకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండానే ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది. గతంలో పొడిగించిన గడువు నేటితో ముగియడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.