బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చి ప్రజలు అందించిన సమస్యల అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణంగా పరిశీలించి ఆయా శాఖలకు పంపి సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.