స్థానిక శ్రీ సత్యసాయి ప్రేమ మందిరంలో దత్త జయంతి వేడుకలు ఆలయ ధర్మకర్తలు కె.శ్రీ హరి ప్రసాద్,వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు.అర్చకులు హనుమా చారి ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు.ఉదయం 5:15 నిమిషాలకు స్వామి వారికి కాగడ హారతి,6గం.లకు శ్రీ షిరిడి సాయిబాబా మంగలస్నానము నిర్వహించారు.
11 గంటలకు స్వామి వారిని పల్లకి లో గ్రామ పురవీధుల్లో ఊరేగింపు జరిపారు.
6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భజన మండలి సభ్యులచే సాయి ఏకాహం నిర్వహించారు.మధ్యాహ్నం 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం ఓఎస్డీ ఆవల సత్యనారాయణ,రిటైర్డ్ తహసీల్దార్ నర్సింహరావు, జానారెడ్డి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, వెంకట సుబ్బయ్య, గొంతిన సాయిరామ్, రామకృష్ణ, రాజేష్, సుధాకర్, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.