సీఎం చంద్రబాబు నేడు పోలవరంలో పర్యటించి.. ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు.
కుట్ర, రాజకీయాలతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని సీఎం విమర్శించారు. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల రూ.2,400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందన్నారు. కుడి, ఎడమ కెనాల్ పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.