వైసీపీ కీలక నేత జోగి రమేష్, టీడీపీ నేతలతో ఓ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, కొనకళ్ల నారాయణ సహా పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమానికి జోగి రమేష్ కూడా హాజరయ్యారు. ఆయన ఎందుకు వచ్చారు? ఎవరు ఆహ్వానించారనే విషయాలపై లోకేష్ టీడీపీ నేతలను వివరణ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa