రాత్రి అవుతుందంటే చాలు ఇంటి తలుపులు తీయడానికి వణికిపోతుంటారు. ఎంత అత్యవసరమైన పని ఉన్నా ఇల్లు దాటి బయటకు రావడానికి వణికిపోతారు. ఒకరిద్దరు కాదు గ్రామంలో ఏ ఒక్కరు నైట్ టైమ్ బయటకు రావడానికి సాహసించరు. అసలు ఇంతగా భయపడటానికి ఆ ఊరిలో ఏముందని అంతా ఆశ్చర్యపోతుంటారు. విషయం ఏమిటంటే ఆ ఊరిలో పాముల భయం ఎక్కువ. ప్రస్తుతం ఈ భయం గ్రామస్తులో ఎంతగా పెరిగిపోయిందంటే..ఆ ఊరి జనానికి ఒకటే భయం. ప్రజలు సాయంత్రం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఊరు ఊరంతా పాములకు నిలయంగా మారిపోయిందని చెప్పుకుంటారు. ఇంతకీ ఈగ్రామం ఎక్కడుందంటే పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌లోని ఓ గ్రామం. ఏడాదిలో 20-25 మంది మృతి.. గత కొద్దిరోజులుగా ఈ గ్రామంలో సుమారు 20-25 మంది పాముకాటుకు గురయ్యారు. అదే సమయంలో 21వ శతాబ్దంలో కూడా ఇదే గ్రామంలో చాలా మంది ఆధునిక మందులకు దూరమై మూఢనమ్మకాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగానే తంత్ర మంత్రాలు చేసే భూతవైద్యులు కూడా గ్రామస్తుల నిస్సహాయతను ఉపయోగించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా మార్చుకుంటున్నారు. స్నేక్స్ విలేజ్..ఇంతకు ముందుతో పోలిస్తే గ్రామంలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా బాగా లేదు. నార్త్ 24 పరగణాస్ జిల్లా మతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కచువా గ్రామ పంచాయితీలోని గోబిలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గతేడాది వర్షాకాలం తర్వాత పాము కాటుతో చిన్నారి సహా ముగ్గురు చనిపోయారు. ఈ ఏడాది పాము కాటుతో మరో వ్యక్తి చనిపోయాడు. ఇక్కడి ప్రజలు విషపూరితమైన పాములను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు 20 నుంచి 25 మంది పాము కాటుకు బలైన వాళ్లే ఉన్నారు. గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? గోబిలా గ్రామ ప్రజలు సాయంత్రం పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ భయం గ్రామం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. పాముల భయంతో ప్రజలు దైనందిన జీవితాన్ని సక్రమంగా గడపలేకపోతున్నారు. ఇప్పటికే పలు పాములను పట్టుకుని అటవీశాఖకు అప్పగించారు. ఇప్పుడు పాముల భయం పోగొట్టి సాధారణ జీవితానికి రావడమే గ్రామస్తుల ప్రధాన లక్ష్యం. ఏం చేస్తున్నారు..? పాముల భయంతో రాత్రి పూట ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కావున రోడ్లపై వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంఘటనను బసిర్‌హత్ బ్లాక్ 2 పంచాయితీ సమితికి చెందిన ఫుడ్ ఆఫీసర్ బుల్బుల్ ఇస్లాం నివేదించారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లడం గురించి ప్రజల్లో అవగాహన పెంచుతున్నట్లు చెప్పారు. అంతే కాకుండా అటవీ శాఖను నిరంతరం సంప్రదిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలకు లైట్లు అమర్చనున్నారు. ఈ భయం నుంచి గ్రామస్తులు ఎప్పుడు బయటపడతారు? ఈ సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. అంతిమంగా ఈ పాము భయాన్ని పోగొట్టుకుని జనం సాధారణ జీవితానికి ఎప్పుడు వస్తారన్నది అతని ప్రశ్న.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa