మధురవాడలోని పరదేశిపాలెంలో రూ. 13 లక్షలతో చేపట్టే రోడ్లు, కాలువల పనులకు సోమవారం కార్పొరేటర్ మొల్లి హేమలత భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ, పరదేశిపాలెంలో ఇప్పటికే రూ. 16 లక్షలతో రోడ్లు, కాలువలు నిర్మించినట్లు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్లు, కాలువలు వేసేందుకు భూమిపూజ చేసినట్లు చెప్పారు.