చెరుకుపల్లి, అమత్తలూరు మండలాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా మొఖమాటం రాధాకృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలలో చెరుకుపల్లి, అమర్తలూరు మండలాల్లోని ఆరు సాగునీటి సంఘాల అధ్యక్షులు రాధాకృష్ణమూర్తిని డీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కూచిపూడి సాగునీటి సరఫరా విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దివ్యభారతి తెలిపారు. ఆయన్ని పలువురు అభినందించారు.