ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహోబిలం ఆలయాన్ని దర్శించుకున్న మంచు మనోజ్ దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 06:16 PM

సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంచు మనోజ్ కుటుంబం దర్శించుకుంది. అహోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వామిని, అమృతవలి అమ్మవారిని మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు దర్శించుకున్నారు. భూమా విఖ్యాత్ రెడ్డి, మంచు మనోజ్, మౌనికలకు ఈ సందర్భంగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa