రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ బుధవారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నా రు. క్వారీ సెంటర్‌లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని ప్రజాప్రతినిధులు ,అధికారులతో చర్చిస్తారు.