కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెర లేచింది. భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేద్కర్‌ను అమిత్ షా అగౌరవపరిచారని ఖర్గే ఆరోపించగా దీనిపై అమిత్ షా స్పందించారు.
తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందంటూ కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి అపారమైన గౌరవం ఉందని కానీ అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ చారిత్రాత్మకంగా గౌరవం చూపలేదని విమర్శించారు.