అమెరికాలోని కాలిఫోర్నియాలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఒకే సారి 34 కేసులు వెలుగు చూడడంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. మొదట దక్షిణ కాలిఫోర్నియాలోని డెయిరీ ఫాంలోని ఆవుల్లో ఈ కేసులను గుర్తించారు.
దాంతో వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వైరస్ బారినపడినవారందరూ ఆ డెయిరీ ఫాం దగ్గర్లో ఉన్న, పని చేసిన వ్యక్తులేనని తెలిపారు.