గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈనెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి 68వ బేస్ బాల్ పోటీలలో ఎస్వి జూనియర్ కళాశాల విద్యార్థి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. రైల్వే కోడూరుకు చెందిన అరవింద్ అనే విద్యార్థి ప్రతిభ కనబరిచి 2025 జనవరి 13, 14 తేదీలలో మహారాష్ట్రలో జరిగే నేషనల్ లెవల్ బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడని బుధవారం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, డైరెక్టర్ వసుందర, పిడి పుల్లారావు తెలిపారు.