2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీలో కీలక మార్పులు చేర్పులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.