రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంతపాలనను సాగిస్తోందని మాజీ చీఫ్ విప్, వైయస్‌ఆర్ సీపీ సీనియర్ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1977 నాటి ఎమర్జెన్సీ కాలం కంటే దారుణంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఏ నియంతా వ్యవహరించని విధంగా ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామిక స్ఫూర్తికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి, అరాచక పాలనకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు.