వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. క్వాష్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు.ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. విచారణను వాయిదా వేసింది. ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది.