ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు.. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైయస్ జగన్ ఉద్ఘాటించారు.