జిల్లాలో కీలకమైన జలవనరు కందులు ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ జలాశయానికి భారీ ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో విజయవాడ నుంచి బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం చేపడుతున్న క్రమంలో సదరు కాంట్రాక్టు సంస్థ మండల పరిధిలో ఉన్న గార్లపాడు గ్రావెల్ కొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు ప్రారంభించడంతో బుధవారం దొడ్డవరం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ మేరకు ప్రాజెక్టుల ఎస్‌ఈ అనుమతి ఇవ్వడంతో ఆ సంస్థ గురువారం పెయ్యాలతిప్పకు వెళ్లడానికి ధేనువకొండ వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఎన్నెస్పీ కెనాల్ మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టారు.