ప్రకాశం జిల్లా కంభం మండలంలోని ఔరంగాబాదు గ్రామ సర్పంచ్ వరి కుంట్ల కళావతి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం అకాలమరణం చెందారు. ఆమె మృతికి పలువురు రాజకీయ నాయకులు సన్నిహితులు సంతాపం తెలిపారు. సర్పంచ్ కళావతి అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం ఔరంగాబాదు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంతిమ యాత్రలో పాల్గొనేందుకు పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామానికి చేరుకున్నారు.