ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్సిల్ లో మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 02:24 PM

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పార్సిల్ కలకలం సృష్టించింది. సాధారణంగా పార్సిల్‌లో ఏమైనా వస్తువులు వస్తాయి కానీ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి మండలం యoడగండిలో మాత్రం ఓ పార్సిల్‌లో మృతదేహం వచ్చింది. ఇది చూసిన వారు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యoడగండిలో పార్సిల్‌గా ఓ వ్యక్తి డెడ్ బాడీ వచ్చింది. జగనన్న కాలనీలో ఇంటిని నిర్మిస్తున్న సాగి తులసి అనే మహిళకు ఈ పార్సిల్ వచ్చింది.ఇంటి సామగ్రితో పాటు పార్సిల్‌గా ఓ వ్యక్తి డెడ్‌బాడీ రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ పార్సిల్ రాజమండ్రి క్షత్రియ పరిషత్ నుంచి వచ్చినట్లు సమాచారం. సాగి తులసి నిర్మిస్తున్న ఇంటికి సామగ్రిని రాజమండ్రి క్షత్రియ పరిషత్ నిర్వాహకులు సరఫరా చేస్తుంటారు. ఆ మహిళకు ఇంటి సామాన్లను ఓ ఆటో డ్రైవర్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అతను తులసికు ఫోన్ చేసి ఇంటికి సంబంధించిన వస్తువులు వచ్చాయని ఫోన్ చేసి తెలిపాడు.సదరు మహిళ ఆ సామాన్లను తీసుకుంది. ఈరోజు ఉదయం ఆ వస్తువులను తెరవగానే ఒక్కసారిగా షాక్‌కు గురి అయింది. ఆ పార్సిల్‌లో వ్యక్తి మృతదేహం చూసి భయపడిపోయింది. అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ పార్సిల్‌ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది. పార్సిల్ తెచ్చిన సదరు వ్యక్తి కదలికలపై సైతం పోలీసులు నిఘా పెట్టారు. ఆవ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ పార్సిల్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com