ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆమె పర్యటన కొనసాగుతోంది. వనగుట్టపల్లిలో రచ్చబండ వద్ద మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్లతో పేదలకు అన్నం పెడుతున్నామని, పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తామని నారా భువనేశ్వరి అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు.వైఎస్సార్‌సీపీ హాయంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆర్థికంగా సహాయ సాకారం అందిస్తున్నామని తెలిపారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు, వీధి దీపాలు, కాలువలు నూరు శాతం పూర్తి చేస్తారని తెలిపారు.హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరును అందుబాటులో తెస్తారని, రైతులు పండించే పంటల కోసం కార్గో ఎయిర్‌పోర్టు విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారని నారా భువనేశ్వరి చెప్పారు. వైఎస్సార్‌సీపీ హాయంలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గంజాయి లేకుండా యావత్ ఆంధ్రప్రదేశ్‌లోని కమిటీ ఒకటి వేశారని తెలిపారు. కరువు రహితం అనేది ఆంధ్ర రాష్ట్రంలో విజన్ 2047 ప్రారంభించారని, ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా.. రోల్ మోడల్‌గా చేసి ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలనే మంచి ఆలోచనతో.. ధ్యేయంతో సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారని అన్నారు. కుప్పం రుణం తీర్చుకుంటామని.. తమ కుటుంబం ఎప్పుడు ప్రజలకు కట్టుబడి ఉంటామని, టీడీపీ కార్యకర్తలను ఎప్పుడు మర్చిపోలేమని నారా భువనేశ్వరి వ్యాఖ్యనించారు.కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. నాటి సరదాలే కాదు.. చిన్న వయసులోనే పెళ్లయిన అమాయకత్వాన్ని, ఏమీ తెలియనితనంనుంచి భర్త చంద్రబాబు దన్నుతో హెరిటేజ్ సారథిగా సాధించిన విజయాలను తలపోశారు. అన్న బాలకృష్ణ డైలాగ్‌ను వల్లించారు. కుమారుడు లోకేశ్ బాల్యాన్ని, పెద్దయ్యాక ఆయనకు చేసిన ఉద్బోధను ఏకరువు పెట్టారు. మొత్తంమీద నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మమేకమై వారిలో ఒకరిగా మారిపోయారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా ఇచ్చిన సమాధానాలలో కాసేపు సరదాగా, కాసేపు సీరియ్‌సగా, ఇంకాసేపు గంభీరంగా ఆమె చాలా అంశాలు ప్రస్తావించారు.