కొత్త ఏడాదికి చాలా మంది కొన్ని అలవాట్లకు ముగింపు పలకాలని, కొన్ని మంచి పనులు చేయాలని తీర్మానాలు చేయకోవడం కామన్. ఈ నేపథ్యంలోనే 'స్టాటిస్టా' సంస్థ 2025 ఏడాదికి గాను అమెరికన్లు తీసుకునే రిజల్యూషన్‌ల విషయమై సర్వే నిర్వహించింది. అందులో ఎక్కువ డబ్బు ఆదా చేయాలనే రిజల్యూషన్ టాప్‌లో నిలిచినట్లు సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం ప్రతి ఐదుగురు అమెరికన్లలో ఒకరు ఆర్థిక లక్ష్యానికి కట్టుబడి ఉన్నారని తెలిసింది. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఎక్కువ వ్యాయామం చేయడం, బరువు తగ్గడం వంటి తీర్మానాలు ఉన్నాయి. ఇక ప్రతి పది మందిలో నలుగురు అమెరికన్లు వచ్చే సంవత్సరానికి ఎటువంటి తీర్మానాలను ప్లాన్ చేసుకోలేదని చెప్పారు.