రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్) సంస్థ మూడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 2కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో గురువారం ఉండవల్లిలో ఈ ఒప్పందాలు చేసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీడాప్ పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీడాప్ చైర్మన్ గునుపాటి దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.