తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడిగా మురాల సునీల్ కుమార్(జనసేన)ఎంపికయ్యారు. కాకినాడ శనివారం కలెక్టరేట్ స్పందన హాలులో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలునిర్వహించారు. ఉపాధ్యక్షునిగా తమలంపూడి సుధాకర్ రెడ్డినిఎన్నుకున్నారు.
తూర్పు డెల్టా పరిధిలోని 16సాగునీటి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు తమ ఓటుహక్కునువినియోగించుకుని ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. ఈఎన్నికలకు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ వ్యవహరించారు.