ప్రకాశం జిల్లా, ముండ్లమూరులో మరోసారి భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఉదయం 10:35 గంటలకు భూమి కంపించింది. ఇవాళ మరోసారి అదే సమయానికి ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. శని, ఆదివారాల్లో వచ్చిన ప్రకంపనలకు ఇళ్లల్లోని వస్తువులు సైతం కదిలిపోయాయి. మూడ్రోజులుగా వస్తున్న భూప్రకంపనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa