వాతావరణంలో ఏర్పడిన మార్పులతో పంటలను తెగుళ్ల బెడద వెంటాడుతోంది. ఎన్ని పురుగుమందులు వినియోగించినా తెగుళ్లు నివారణ కావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా తరచూ మంగు వాతావరణం ఉండడంతో పైర్లకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో పంట లను కాపాడుకునేందుకు కర్షకులు నానా అగ చాట్లు పడుతు న్నారు. విపరీతంగా పురుగు మందులు వినియోగిస్తూ పిచికారి చేస్తూ అధిక భారాన్ని మోస్తు న్నారు. అయినా తెగుళ్లు అదుపు లోకి రాలేదని రైతులు వాపోతు న్నారు. చివరికి వర్షాదారంగా సాగు చేసే మినుము, పప్పు శనగ, జొన్న, ఆముదం పంటలకు కూడా రెండు మూడు సార్లు మందులు వినియోగించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.