పాకల తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఆదివారం రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీ లను ప్రారంభించిన అనంతరం ఆయన పాకల తీరంలో పర్యటించారు. గత టీడీపీ ప్రభుత్వంలో పర్యాటకుల కోసం రూ.4 కోట్ల టూరిజం రెస్టారెంట్ పనులను ప్రారంభించి సగభాగం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఆ పను లను నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలిచిపోయిన టూరిజం రెస్టారెంట్ పనులను ఏడాదిలోపు ప్రారంభించి పూర్తిచేస్తామని తెలిపారు.
తీరంలో విధులు నిర్వహించే మెరైన్ పోలీసులకు ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించాలని, దానిపై అద్దాలతో మరోక రూమ్‌ను ఏర్పాటు చేయాలని అందులో 360 యాంగిల్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి బీచ్ పరిసరాలపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. అందుకోసం పంచాయతీ నుంచి రూ.5 లక్షల నిధులు ఇవ్వాలని స ర్పంచ్ సైకం చంద్రశేఖర్‌కు సూచించారు. పాకల బీచ్ నుంచి చెల్లమ్మపాలెం వరకూ, బీచ్‌కు ఉత్తరం 300 మీ తీరంలో ఉన్న సీసీ రోడ్డును కలుపుతూ మెటల్ రోడ్డు వెయ్యాలని సర్పంచ్‌ను ఆదే శించారు. తీరంలో పార్క్ నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాయని తెలిపారు.