ఇంటి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఇద్దరు పాతనేరస్తులను నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 21. 05 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ప రెన్స్ హాల్లో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డితో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. ఘరానా దొంగలను అరెస్టు చేసేందుకు సహకరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు.