గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పడపనిపేట గ్రామంలో మంగళవారం 104 వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈమేరకు డాక్టర్ విఎస్ఎస్ఎన్ మూర్తి, 104 సిబ్బంది ఆధ్వర్యంలో రోగులకు పలు పరీక్షలు చేసి మందులు అందజేశారు. కాలనుగుణంగా వచ్చే వ్యాధులు, పరిశుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు గురించి వివరించారు. ఈకార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పి జగదీశ్వరి, ఏఎన్ఎం ఎంఏఎం తాయారు, 104 డిఈవో శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.