కోర్టులో అనుచితంగా ప్రవర్తించినందుకుగాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని న్యాయవాది శివప్రసాద్‌రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. నెల్లూరులో వీధి దుకాణాలు కేటాయింపు టెండర్ విధివిధానాలను సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకురాగా న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ వ్యవహారంలో చర్యలున్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన సింగిల్ జడ్జి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఆ తరువాత కూడా శివప్రసాద్‌రెడ్డి బిగ్గరగా మాట్లాడుతూ మధ్యంతర ఉత్తర్వుల కోసం పట్టుబట్టారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa