ఆటోలలో ఒంటరిగా ప్రయాణించే వారిని దోచుకుంటున్న ముఠాల కార్యకలాపాలు మళ్లీ గుంటూరు నగరంలో ఊపందుకున్నాయి. తెనాలి కేంద్రంగా పెద్ద ఎత్తున ఈ తరహా దోపిడీలకు పాల్పడిన గుంటూరు నగరానికి చెందిన పదిమంది ముఠా సభ్యులను ఇటీవల తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా తెనాలి కేంద్రంగా పెద్ద ఎత్తున ఆటోలలో ప్రయాణికులను దోచుకుంది. అయితే ఆయా ముఠాల్లో ఉన్న వారంతా గుంటూరు నగరానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఆయా ముఠాల అరెస్టుతో ఈ తరహా నేరాలు ఆగిపోతాయని పోలీసులు భావించారు. అయితే తాజాగా అలాంటి సంఘటనలు మళ్ళీ జరగడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
నల్లపాడు పోలీస్ ేస్టషన్ పరిధిలో రాత్రివేళ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో ఎక్కిన ఇరువురు బీహారీలను దుండగులు నల్లపాడు పోలీస్ స్టషన్ పరిధిలో దారి మళ్లించి వారిపై దాడి చేసి సెల్ ఫోన్, నగదు అపహరించకుపోయారు. తాజాగా అరండల్ పేట పోలీస్ ేస్టషన్ పరిధిలోని లాడ్జి సెంటర్ వద్ద నరుకుళ్ళపాడు గ్రామానికి చెందిన ఆంజనేయ వరప్రసాద్ అనే వృద్థుడి జేబులో నుంచి 23 వేలు కొట్టేశారు. ఈనెల 17న మధ్యాహ్నం ఆంజనేయ ప్రసాద్ నరుకుళ్ళపాడు వెళ్లేందుకు లాడ్జి సెంటర్లో ఆటో ఎక్కారు. అప్పటికే ఆటోలో వెనుక ఇరువురు, డ్రైవర్ సీట్ పక్కన మరొకరు ఉన్నారు. దీంతో ఆంజనేయ వరప్రసాద్ వెనుక సీట్లో కూర్చున్నారు అయితే ఆటో కొద్ది దూరం వెళ్ళగానే ముందుగా అక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని, ముందు సీటులో ఉన్న వ్యక్తిని పధకం ప్రకారం వెక్కు పంపాడు. ఆయనను మధ్యలోకి జరిపారు. ఆటోలో ఇరుకుగా ఉన్నట్లు మిగిలిన ముగ్గురు ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ హడావిడి చేసి ఆయన వెనుక జేబులో పెట్టుకున్న 23 వేలను కొట్టేశారు. ఆంజనేయ ప్రసాద్‌ను ఆటో కొద్ది దూరం వెళ్ళగానే పక్కన ఉన్న వ్యక్తి దిగాలని, చెప్పి ఆంజనేయ ప్రసాద్‌ను దించారు. ఆయన అడుగు కిందకు పెట్టిన వెంటనే ఆటోలో నుంచి మిగిలిన వారు దిగకుండానే ఆటో దూసుకుపోయింది. ఆ తర్వాత ఆయన జేబులో చూసుకోగా 23వేలు మాయమయ్యాయి. ఇదే తరహలో ఇటీవల నగరంపాలెం పోలీస్ ేస్టషన్ పరిధిలోనూ మరో ఘటన చోటుచేసుకుంది. రాత్రి గాని, పగలుగాని ఒంటరిగా ఆటోల్లో ఎక్కే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని ఆయా ముఠాలు ఈ విధంగా దోపిడీలకు పాల్పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఒంటరిగా ఆటో ఎక్కే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ముఠాల కార్యకలాపాలతో ప్రయాణీకులు ఆటోలు ఎక్కాలంటేనే హడలెత్తిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa