గుంటూరు జిల్లాలో పింఛన్లు తనిఖీ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద యద్దనపూడి మండల పరిధిలోని పూనూరు--2 గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి తనిఖీ పూర్తి చేశారు. ఇక్కడ మొత్తం 476 మంది పింఛన్లు అందుకుంటుండగా 447 మందికి సంబంధించి యంత్రాంగం పింఛన్ అందుకుంటున్న వారి వివరాలను నమోదు చేసి వెరిఫై అంకాన్ని పూర్తి చేసింది.
పింఛన్ అందుకుంటున్న 29 మంది అందుబాటులో లేకపోవడంతో వాటిని హోల్డ్‌లో పెట్టి ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తున్నారు. ఇదిలా ఉంటే మొత్తం 447 తనిఖీల్లో భాగంగా అనర్హులుగా 18 మందిని గుర్తించినట్లు సమాచారం. వీరందరికి ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే నోటీసులు జారీ చేసే ప్రక్రియ చేపట్టనున్నారు. వారి వివరణ కూడా తీసుకున్న తర్వాతనే పింఛన్ తొలగింపుపై ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం